Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌ వంశీకృష్ణపై వేటు.. ఇన్‌చార్జ్‌గా శ్రీజారెడ్డి

నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేషన్‌లో నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య ని యామకం వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

BIG BREAKING : నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌ వంశీకృష్ణపై వేటు.. ఇన్‌చార్జ్‌గా శ్రీజారెడ్డి

—నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య నియామకం వ్యవహారంలో కీలక మలుపు

–కమిషనర్ బీ.వంశీకృష్ణపై ఉన్నతాధికారుల ఆగ్రహం, స్థానంలో ఇంచార్జి గా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేషన్‌లో నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య ని యామకం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వి వాదం నేపథ్యంలో కార్పొరేషన్ కమిషనర్ బీ. వంశీకృ ష్ణపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ పరిణా మం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది.

వివాదానికి కారణమైన నకిలీ డెత్ సర్టిఫికెట్

కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారంలో కొందరు మున్సిపల్ సిబ్బంది పా త్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం పై విచారణ, చర్యల క్రమంలో మరికొందరిని అన్యా యంగా కేసులో ఇరికించారంటూ కమిషనర్ వంశీకృష్ణ పై ఆరోపణలు వచ్చాయి.

Also Read : ఏసీబీ వలకు చిక్కిన తిమింగళం.. రూ.1.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్..!

చర్యలకు బదులు క్రిమినల్ కేసులా?

ఈ వ్యవహారంలో బాధ్యులపై శాఖాపరమైన చర్య ల తోనే పరిష్కరించాల్సిన అంశాన్ని క్రిమినల్ కేసుల వర కు తీసుకెళ్లారంటూ కమిషనర్ తీరుపై విమర్శలు వ్యక్త మయ్యాయి. ఈ పరిణామాలతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఉన్నతాధి కారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

శ్రీజరెడ్డి

ఇన్‌చార్జ్ కమిషనర్‌గా శ్రీజారెడ్డి

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కమిషనర్ బీ. వంశీ కృష్ణను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి కి నల్లగొండ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ బాధ్యత లు అప్పగించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం, కా రుణ్య నియామక వివాదం నేపథ్యంలో చోటుచేసు కు న్న ఈ బదిలీ ఇప్పుడు నల్లగొండ మున్సిపల్ రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహా రంలో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుం టాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు