ముగిసిన మల్లేపల్లి ప్రీమియర్ లీగ్ – 3.. విజేతలకు బహుమతులు ప్రదానం..!
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన మల్లేపల్లి ప్రీమియర్ లీగ్ - 3' (ఎంపీ ఎల్- 3 )క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి.

ముగిసిన మల్లేపల్లి ప్రీమియర్ లీగ్ – 3.. విజేతలకు బహుమతులు ప్రదానం..!
(చింతపల్లి, మనసాక్షి – వెంకట్)
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన మల్లేపల్లి ప్రీమియర్ లీగ్ – 3′ (ఎంపీ ఎల్- 3 )క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నేనావత్ కిషన్ నాయక్ ఈ టోర్నమెంట్ విజేతలకు అందించిన మొత్తం లక్ష రూపాయల (₹1,00,000) ప్రైజ్ మనీని స్వయంగా స్పాన్సర్ చేశారు.
టోర్నమెంట్ విజేతల వివరాలు:
- మొదటి బహుమతి (విన్నర్): కింగ్స్ 11 దేవరకొండ జట్టు — ₹50,000 నగదు బహుమతి-
- రెండవ బహుమతి (రన్నరప్): మల్లేపల్లి జట్టు — ₹30,000 నగదు బహుమతి.
- మూడవ బహుమతి: నల్గొండ జట్టు — ₹20,000 నగదు బహుమతిని అందుకున్నారు.
ఈ సందర్భంగా నేనావత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. నేటి “యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని” అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు ముఖ్య అతిథి నేనావత్ కిషన్ నాయక్ ని ఘనంగా సత్కరించి, ప్రైజ్ మనీ స్పాన్సర్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టోర్నమెంట్ నిర్వాహకులు మరియు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు పాల్గొన్నారు.









