Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

తెలంగాణలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ చిక్కిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యో గులు..!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవి నీతి అధికారులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపించింది. రెండు వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీ బీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

తెలంగాణలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ చిక్కిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యో గులు..!

ఆస్తి మ్యుటేషన్‌కు రూ.30 వేలు

వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు

తెలంగాణ బ్యూరో, మన సాక్షి :

ప్రభుత్వ కార్యాలయాల్లో అవి నీతి అధికారులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝళిపించింది. రెండు వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీ బీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒకరు ఆస్తి మ్యుటేషన్ కోసం, మరొకరు వితంతు పింఛన్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ చిక్కడం కలక లం రేపింది.

ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో రూ.30 వేల లంచం

కుత్బుల్లాపూర్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపల్ కార్యా లయంలో వార్డు అధికారిగా పనిచేస్తున్న డి. రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటూ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి చెందిన పూర్వీకుల ఇంటి ఆస్తిని తండ్రి పేరు నుంచి త న పేరు మీదకు మార్చేందుకు (మ్యుటేషన్) సహకరిం చాలంటే తొలుత రూ.40 వేలు డిమాండ్ చేశారు. అ నంతరం రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో నవంబర్ 20న తన కార్యాలయంలోనే ఫిర్యాదుదారుని నుంచి రూ.30 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా లబ్ధిపొందేం దు కు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది.

వితంతు పింఛన్ కోసం రూ.10 వేల వసూలు

మరో ఘటనలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్ లాల్ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుదారుని కోడ లికి టీజీ చేయూత పథకం కింద వితంతు పింఛన్ మం జూరు ప్రక్రియను పూర్తి చేసినందుకు రూ.10 వేలు లం చం డిమాండ్ చేశారు.నవంబర్ 21న ఫిర్యాదుదారుని నివాసంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరిపై కేసులు.. న్యాయస్థానానికి తరలింపు

ఈ రెండు ఘటనల్లోనూ నిందితులను అరెస్టు చేసి సం బంధిత ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాల ముందు హాజ రుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెం డు కేసులపై విచారణ కొనసాగుతోంది. ఫిర్యాదుదారుల భద్రత దృష్ట్యా వారి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ కార్యా లయాల్లో ఏ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్ర జలు భయపడకుండా తెలంగాణ ఏసీబీని సంప్రదించా లని అధికారులు సూచించారు.

టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ Telangana AC B,ఎక్స్ (ట్విట్టర్) @Telangana ACB లతో పాటు లంచం డిమాండ్‌పై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇచ్చిం ది.ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజల పనులకే లంచాలు డిమాండ్ చేసే అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు