BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..!
వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..!
వికారాబాద్, మన సాక్షి :
వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు వెళ్తున్న ఆటో బుగ్గ రామేశ్వరం సమీపంలోని మలుపు వద్దకు చేరుకో గానే లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు.
మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే సారి మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో పెండ్లిమడుగు, కేరెల్లి ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.









