హైదరాబాద్‌లో ఉగ్రదాడుల కలకలం, 26/11 తరహా దాడులంటూ బెదిరింపు..!
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రదాడుల బెదిరింపు కలకలం రేపింది. ముంబైలో జ రిగిన 26/11 తరహా ఉగ్రదాడులను హైదరాబాద్ లో నూ పునరావృతం చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల కలకలం, 26/11 తరహా దాడులంటూ బెదిరింపు..!
కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామంటూ హెచ్చరిక
300 మందిని చంపడమే లక్ష్యమంటూ మెయిల్
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రదాడుల బెదిరింపు కలకలం రేపింది. ముంబైలో జ రిగిన 26/11 తరహా ఉగ్రదాడులను హైదరాబాద్ లో నూ పునరావృతం చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో కాచిగూడ టూరిస్ట్ ప్లాజా, రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. కనీసం 300 మందిని హతమార్చడమే తమ లక్ష్యమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
లతీఫ్ భట్, అతని సహచరులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడతామని మెయిల్‌లో హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిణామంతో అప్ర మత్తమైన స్పెషల్ బ్రాంచ్ అధికారులు నగర పోలీసులకు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. అయితే, ప్రాథమిక పరిశీలనలో ఈ బెదిరింపు మెయిల్ నకిలీదిగా (ఫేక్) పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అయినప్పటికీ భద్రతాపరమైన అంశాలను దృష్టి లో ఉంచుకుని పోలీ సులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ బెదిరింపే అయినా.. భద్రత విషయంలో రాజీ పడకుండా పోలీ సులు నిఘా పెంచారు.









