Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య, కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు నాటకం..!

భర్త వేధింపులు భరించలేకపో తున్నాననే ఆగ్రహంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడమే కాకుండా, ఈ ఘటనను విద్యుత్ షాక్‌ తో జరిగిన ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య, కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు నాటకం..!

మద్యం తాగి నిత్యం గొడవపడుతున్నాడనే కోపంతో ఘాతుకం

విద్యుత్ వైర్లతో ప్రమాదంగా చిత్రీకరించే యత్నం

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజం

సంగారెడ్డి, మన సాక్షి :

భర్త వేధింపులు భరించలేకపో తున్నాననే ఆగ్రహంతో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడమే కాకుండా, ఈ ఘటనను విద్యుత్ షాక్‌ తో జరిగిన ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల లోతైన విచారణతో అసలు విషయం బయటపడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్‌వాడిలో ఈ నెల 10న జరప్ప (46) అ నుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత విద్యుత్ షాక్ కారణంగానే ఆయన మరణించినట్లు భావించా రు. అయితే ఘటనపై అనుమానం రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై భార్య బుజ్జమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం బెడ్‌పై విద్యుత్ వైర్లు ఉంచి, కరెం ట్ షాక్ తగిలి భర్త మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. రోజూ మద్యం తాగి వచ్చి గొడవపడుతున్నాడనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి నట్లు బుజ్జమ్మ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రమాద మరణంగా నమ్మించాలనుకున్న హత్య పోలీసుల దర్యాప్తుతో అసలు గుట్టు రట్టయింది.

మరిన్ని వార్తలు