Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఉద్రిక్తత.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్..!
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ఓ నిరుపేద వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి చేసిన నిరసన కలకలం రేపింది.

Miryalaguda : మిర్యాలగూడలో ఉద్రిక్తత.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ఓ నిరుపేద వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి చేసిన నిరసన కలకలం రేపింది. దాంతో ఉద్రిక్తత నెలకొన్నది. మిర్యాలగూడ పట్టణం భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్ యూనుస్… పెయింట్ వర్కర్ గా జీవనం సాగిస్తున్నాడు.
అర్హత ఉన్నా తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని, కౌన్సిలర్లు తమ అనుకూల వ్యక్తులకు ఇళ్లు పంచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్ ఎస్ పి క్యాంపు సమీపంలో సెల్ టవర్ ఎక్కాడు. తనకు ఇల్లు కేటాయించే వరకు దిగేది లేదని డిమాండ్ చేశాడు. అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు యూనుస్ కు నచ్చజెప్పి టవర్ పై నుండి సురక్షితంగా కిందకు దింపారు.









