Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

Hyderabad : హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి..!

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి మృతి కలకలం రేపింది. గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ (29) చౌదరిగూడలోని లివింగ్ ట్రీ ఓయూ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Hyderabad : హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి మృతి కలకలం రేపింది. గుంటూరుకు చెందిన కోట శ్రీరామ్ (29) చౌదరిగూడలోని లివింగ్ ట్రీ ఓయూ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

గుంటూరులోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీరామ్.. థియేటర్‌కు చెందిన నగదు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో పాటు ఫోన్‌పే ద్వారా రూ.99,999 తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు యజమాని ఆరోపించాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో అతడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయగా.. ఈ నెల 27న తన పరిస్థితిని వివరిస్తూ తల్లికి, థియేటర్ యజమానికి వీడియో సందేశం పంపి, హోటల్ లొకేషన్‌ను కూడా శ్రీరామ్ షేర్ చేశాడు. అయితే హోటల్ సిబ్బంది గదిలో పరిశీలించగా మృతి చెంది కనిపించగా, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు