Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంహైదరాబాద్

BREAKING : వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి..!

BREAKING : వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి..!

హైదరాబాద్ , మన సాక్షి :

హైదరాబాద్ – మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది.

స్థానికులు గమనించి కుక్కలను తరిమి.. ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు. వెంటనే విహాన్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రి లోని ఎమర్జెనీ విభాగానికి తీసుకెళ్లారు. కానీ కుక్కల దాడిలో ఒళ్లంతా గాయాలు కావడంతో పరిస్థితి విషమించింది బాలుడు మృతి చెందాడు.

జవహర్‌నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మరణం తట్టుకోలేక తల్లి విలవిలలాడుతుంది.

ఇవి కూడా చదవండి : 

BIG BREAKING : రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, తొలి విడత రుణమాఫీ ఈనెల 18నే.. రేషన్ కార్డు పై కూడా స్పష్టత..!

SURYAPET : నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.. ఇద్దరు నిందితుల రిమాండ్..! 

మరిన్ని వార్తలు