ముగ్గురు కుమార్తెల కోసం జీవితమంతా ధారపోసిన తండ్రి.. చివరికి వీడియో కాల్ లోనే కడసారి వీడ్కోలు..!
తనకు కుమారులు లేరు.. ముగ్గురు కుమార్తెలే ఉన్నారు. వారికి మంచి విద్య, ఉద్యోగం, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా జీవితాంతం దారపోసి బతికిన ఓ తండ్రి. చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. ఇంతటి విషాదకరమైన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తుంది.

ముగ్గురు కుమార్తెల కోసం జీవితమంతా ధారపోసిన తండ్రి.. చివరికి వీడియో కాల్ లోనే కడసారి వీడ్కోలు..!
మన సాక్షి :
తనకు కుమారులు లేరు.. ముగ్గురు కుమార్తెలే ఉన్నారు. వారికి మంచి విద్య, ఉద్యోగం, జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా జీవితాంతం దారపోసి బతికిన ఓ తండ్రి. చివరికి ఒంటరిగా కన్నుమూశాడు. ఇంతటి విషాదకరమైన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తుంది. ఆయన మరణించిన విషయం తెలిసినప్పటికీ కూడా ముగ్గురు కుమార్తెలలో ఒకరు కూడా అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబై ప్రాంతాలలో ఉన్న వారు వీడియో కాల్ ద్వారానే తమ తండ్రికి వీడ్కోలు పలికారు. ఈ సంఘటన హర్యానాలోని సోనిపత్ లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ గుప్తా గత ఏడాదిన్నరగా సోనిపత్ లోని వెస్ట్ రామ్ నగర్ లో సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. అతని భార్య మీన కొంతకాలం క్రితం మరణించింది. దాంతో ఒక్కడే ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో పాటు వయోభారం వల్ల అతడు (ఆగస్టు 4) మంగళవారం తెల్లవారుజామున మరణించారు. అతడి మరణించిన విషయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకులు అతడి ముగ్గురు కుమార్తెలకు సమాచారం అందించారు.
అయితే వారు అంత్యక్రియలకు రావడానికి వీలు కాదని తెలిపారు. దాంతో వృద్ధాశ్రమ నిర్వాహకులు స్థానిక సామాజిక కార్యకర్తల సహకారంతో గుప్త అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా కుమార్తెలకు ప్రత్యక్ష ప్రసారం చేశారు. వారు దూరం నుంచే తండ్రి దహన సంస్కారాలను వీక్షించి కడసారి వీడ్కోలు పలికారు.
శివ చరణ్ గుప్తా అప్పుడప్పుడు తన కుమార్తెలతో తరచూ ఫోన్ లో మాట్లాడేవారని వృద్ధాశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారితో మాట్లాడే సంభాషణలు తగ్గిపోయాయని, సుమారు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా.. ఎవరు రాలేదని వృద్ధాశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.
కుమారుడు లేకపోవడం వల్ల ముగ్గురు కుమార్తెల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఉన్నత విద్యను అందించారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అనిత నేపాల్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్ లో, చిన్న కుమార్తె ప్రియ ముంబైలో వారి వారి కుటుంబ సభ్యులతో స్థిరపడ్డారు.
తండ్రి అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ అనిత ఫోన్ లో మాట్లాడిన తీరు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆన్ లైన్ ద్వారా 5100 పంపించి చేతులు దులుపుకున్నట్లు వ్యవహరించింది. వీడియోలను కూడా తమకు పంపాలని వృద్ధాశ్రమ నిర్వాహకులను కోరారు. ఇంకా ఎంత సమయం పడుతుంది త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయండి.. మేము భోజనం చేయాలి అంటూ వీడియో కాల్ లో మాట్లాడిన ముగ్గురు కుమార్తెల తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిసి వేస్తుంది.
తండ్రి అంత్యక్రియలకు ముగ్గురు కుమార్తెలు ఎవరు ప్రత్యక్షం కాకపోవడం, పెద్ద కుమార్తె ఆన్ లైన్ లో డబ్బులు పంపగా వృద్ధాశ్రమ యాజమాన్యం స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించడం, తండ్రికి చివరి వీడ్కోలు వీడియో కాల్ ద్వారా పలకడం, ఆస్తికలను కూడా గంగానదిలో నిమజ్జనం చేయాలని కోరటం చూస్తుంటే.. కుటుంబ బంధాలు, మానవీయ విలువలపై చర్చకు దారితిస్తుంది.
MOST READ
- ఎక్కుతుండగానే పైకి కదిలిన లిఫ్ట్.. తలుపుల మధ్య ఇరుక్కొని మహిళ మృతి..!
- జూరాలకు హోరెత్తిన వరద.. 27 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
- WhatsApp : వాట్సప్ యూజర్లకు బిగ్ షాక్.. సస్పెండ్ అవుతున్న ఎకౌంట్లు.. ఎందుకంటే..!
- Nizamabad : ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్..!
- Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!









