Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Kamareddy : ముగ్గురి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పోస్టుమార్టం లో సంచలనం..!

Kamareddy : ముగ్గురి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పోస్టుమార్టం లో సంచలనం..!

మన సాక్షి, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్, మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వల్ల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. చెరువులో ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఒకరిని కాపాడబోయి మరొకరు, వారిని కాపాడబోయి మరొకరు ఇలా ముగ్గురు మృతి చెందినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి వివాహేతర సంబంధాలు కూడా కారణమేనా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎస్సై సాయికుమార్ రెండు ఫోన్లు, కానిస్టేబుల్ శ్రుతి ఒక ఫోను, నిఖిల్ రెండు ఫోన్లు వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించిన చాటింగ్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎస్సై వ్యక్తిగత ఫోన్ లాక్ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేకపోవడంతో పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కీలక ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.

అయితే వీరి ముగ్గురి ఒంటిపై ఎలాంటి గాయాలు ఉన్నాయా..? లేవా..? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దాంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారింది. కీలక ఆధారాల కోసం సాంకేతిక సాయంతో విచారణ చేస్తున్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వరకు సిసి పూటేజీ సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు