MIRYALAGUDA : వేములపల్లిలో వాహనం ఢీకొని మహిళ మృతి.. చిన్నారికి గాయాలు..!

బొలోరో వాహనం ఢీకొని మహిళ మృతి, చిన్నారికి గాయాలు అయినా ఘటన వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

MIRYALAGUDA : వేములపల్లిలో వాహనం ఢీకొని మహిళ మృతి.. చిన్నారికి గాయాలు..!

వేములపల్లి , మన సాక్షి :

బొలోరో వాహనం ఢీకొని మహిళ మృతి, చిన్నారికి గాయాలు అయినా ఘటన వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ డి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎన్.ఎస్.పి క్యాంపులో నివాసముంటున్న మల్లికంటి కలమ్మ(40) అలియాస్ కళావతి తన కుమార్తె కూతురు ఐషు (మనవరాలు)ను ఎత్తుకొని వేములపల్లి కేంద్రంలో ఓ పని నిమిత్తం ఉదయం నడుచుకుంటూ వస్తుండగా జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద బొలెరో వాహనం ఢీ కొట్టింది.

ALSO READRuna Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

అద్దంకి-నార్కట్పల్లి రోడ్డు వెంబడి మట్టి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం, కూకట్లపల్లి గ్రామానికి చెందిన తాళ్ల అంజిరెడ్డి (టీఎస్ 05 యూఎఫ్ 6282) నెంబర్ గల బొలోరో వాహనంతో అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో కలమ్మ తలకు, కాళ్లకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మనవరాలు ఐషు తలకి, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడే ఉన్న మల్లికట్టి మహేష్ కుమార్, నార్ల కంటి సుధాకర్లు తన భర్త అయినా మల్లికంటి సంపత్ కు సమాచారం ఇచ్చారని, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న సంపత్ రక్త గాయాలతో పడి ఉన్న తన భార్య కలమ్మ ను, తన మనవరాలు ఐషు లను 108 అంబులెన్స్ లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో రాత్రి 11. 30 గంటలకు కలమ్మ చనిపోయింది.

మనవరాలు ఐషు ను మెరుగైన వైద్యం నిమిత్తం మిర్యాలగూడలోని స్టార్ హాస్పిటల్ కి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

ALSO READ :

BREAKING : సమన్వయంతో పనిచేసి జిల్లాని అభివృద్ధి బాటలో నిలుపుదాం.. బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..!

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!