వాహనం ఢీకొని వృద్ధుడు మృతి..!

గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చివ్వెంల మండలం అక్కలిదేవి గూడెం వద్ద చోటుచేసుకుంది.

వాహనం ఢీకొని వృద్ధుడు మృతి..!

చివ్వెంల, (మన సాక్షి ):

గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చివ్వెంల మండలం అక్కలిదేవి గూడెం వద్ద చోటుచేసుకుంది.

చివ్వెంల ఎస్సై బి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి పాలవరపు సోమేశ్వరరావు (75) కు గత కొంతకాలంగా మతిస్థిమితం తప్పింది. బుధవారం సూర్యాపేటలోని ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్లి ఇంటికి రాలేదు.

ALSO READ : Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గురువారం తెల్లవారుజామున అక్కల దేవి గూడెం వద్ద రోడ్డుపై మృతి చెంది ఉండడంతో స్థానికులు చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొదట గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంధువుల ఆచూకీ ద్వారా వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!