Accident : రోడ్డు ప్రమాదంలో తల్లి.. ఇద్దరు కూతుళ్లు మృతి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

Accident : రోడ్డు ప్రమాదంలో తల్లి.. ఇద్దరు కూతుళ్లు మృతి..!

దమ్మపేట , మన సాక్షి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల.. ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం వేములపాడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు బాలకృష్ణ , లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు శరణ్య ,శాన్వితతో కలిసి బైక్ పై వెళుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుండి అశ్వరావుపేట వైపు వెళ్తున్నారు. కాగా దమ్మపేట మండలంలోని దాబా హోటల్ సమీపంలో వారి ద్విచక్ర వాహనాన్ని ఒక కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో లక్ష్మి (30) శరణ్య (8) శాన్విక(6) అక్కడికక్కడే మృతి చెందారు. బాలకృష్ణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ :