Accident In Dubai : దుబాయిలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భారతీయులు మృతి..!
దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ లో జరిగిన ఈ విషాద ఘటనను భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది.

Accident In Dubai : దుబాయిలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భారతీయులు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ లో జరిగిన ఈ విషాద ఘటనను భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. దుబాయ్ పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం..
సాంకేతిక లోపం కారణంగా ఒక భారీ ట్రక్కు ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని గమనించకుండా ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా మొత్తం తొమ్మిది మంది కార్మికులు గాయపడగా, ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయం ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న భారతీయ పౌరులను పరామర్శించి వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :









