Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Sp : చైనా మాంజా వాడితే చర్యలు.. జిల్లా ఎస్పి..!

District Sp : చైనా మాంజా వాడితే చర్యలు.. జిల్లా ఎస్పి..!

నల్లగొండ, మనసాక్షి :

రాబోయే సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు,పెద్దలు సరద కొరకు ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడి పడేయడం వలన ప్రజలకు, పక్షులకు ప్రమాదాల వాటిల్లే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ,ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడుననని తెలిపారు.

చైనా మాంజను పతంగులకు వాడి బయట పడేసినట్లయితే అవి చెట్లకు, ఎలక్రిక్ తీగలకు తగిలి వేలాడి ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఈ మాంజా తగిలి కొన్ని ప్రాంతాలలో ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

కావున విక్రయదారులు ఎవ్వరయిన చైనా మంజా నిలువచేసిన, అమ్మిన, వాడిన డయల్ 100 కి గాని సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు