Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : కల్తీ కల్లు దుకాణాలు సీజ్..!

Hyderabad : కల్తీ కల్లు దుకాణాలు సీజ్..!

మన సాక్షి, హైదరాబాద్ :

కూకట్ పల్లిలోని కల్తీకల్లు దుకాణాలను ఎక్సైజ్ పోలీస్ అధికారులు సీజ్ చేశారు. కూకట్ పల్లిలో కల్తీకల్లు ఘటనలో 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు బాధితులు మృతి చెందారు. కాగా కల్తీ కల్లు సరఫరా చేసిన కల్లు దుకాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం కూకట్ పల్లిలోని షంషీగూడ, హైదర్ నగర్, భాగ్యనగర్, సాయిచరణ్ కాలనీ, సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న కల్లు దుకాణాలను సీజ్ చేశారు. అయితే కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి అయిన వెంటనే కల్లు దుకాణాలకు తాళాలు వేసి శాంపిల్స్ సేకరించారు. కాగా కల్లులో మత్తు పదార్థాలు అధిక మోతాదులో ఉన్నట్లు రుజువు కావడంతో వాటిని సీజ్ చేశారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  2. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  3. Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  5. Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!

మరిన్ని వార్తలు