అద్వానికి భారత అత్యున్నత పురస్కారం..!

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అరుదైన గౌరవం అందించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అద్వానికి భారత అత్యున్నత పురస్కారం..!

మన సాక్షి :

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అరుదైన గౌరవం అందించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలక మమయిందని కొనియాడారు.

అద్వానీని భారతరత్న పురస్కారంతో గౌరవిస్తున్నాం.. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపాను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞలలో ఒకరు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరాస్మరణీయమైనది. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి ఆయన సేవలు చేశారు. పార్లమెంటులో ఆయన అనుభవం ఎప్పటికీ ఆదర్శమైనది. అద్వానీ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చును. జాతి ఐక్యత, సాంస్కృతిక పునర్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన కృషి చేశారు. ఈ పురస్కారం ఆయనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడటం.. ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అని ప్రధానమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!

అద్వానీ ప్రస్థానం :

అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8వ తేదీన కరాచీలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది. కరాచీలోని సెయింట్ ఫ్యాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను చదివారు. 1941 లోనే ఆయనకు 14 వేల వయస్సు ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో చేరారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కరాచీ విభాగం కార్యదర్శిగా నిధులు నిర్వర్తించారు. పాకిస్థాన్ లో ని హైదరాబాదులో గల డీజీ నేషనల్ కాలేజీలో లా పూర్తి చేశారు.

విభజన తర్వాత ముంబైలో స్థిరపడిన ఆయన సంఘ్ ప్రచారక్ గా, జన సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత కౌన్సిల్ అధ్యక్షుడిగా 1967లో గెలుపొందారు. ఆ తరువాత జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు.

ALSO READ : Telangana : తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నిబంధనలు ఇవేనా..!

పార్లమెంటులో 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారిగా ఆయన ఎన్నికయ్యారు. 1976 లో గుజరాత్ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. 1977 – 80లో భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి ప్రభుత్వంలో 77 -79 మధ్యకాలంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆ తర్వాత కొంతకాలం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980 లో అద్వానీ సహా కొంతమంది నేతలు జనసంఘ్ జనతా పార్టీని వీడారు. 1980 ఏప్రిల్ ఆరవ తేదీన వాజ్ పేయితో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్ పేయి ప్రధాన బాధ్యతలు చేపట్టినా ఆ తర్వాత 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది.

ALSO READ : Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!

మళ్లీ 1998లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోకసభ స్థానం నుంచి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. 2009 ఎన్నికల్లో బిజెపికి సరిపడా సీట్లు రాలేదు. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి అద్వానీ గెలుపొందారు. 2019 నుంచి క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు.