Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

26 years : 26 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు

26 years : 26 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు

అర్వపల్లి , మన సాక్షి :

స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా కడదాక నీడలా నీ వెంటే నిల్చురా అంటూ బాల్య స్నేహితులందరూ ఒకే వేదికపై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి వారి తీపి జ్ఞాపకాలను పంచుకున్న సంఘటన మండల పరిధిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగింది.

 

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో 98 – 99 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న 86 మంది విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒకే దగ్గరికి చేరి వారి చిరునాటి జ్ఞాపకాలు వారి తీపి గుర్తులను చేదుగురుతులను ఒకరికి ఒకరు పంచుకొని ఆనందంలో మునిగితేలారు.

పదవ తరగతి తర్వాత ఉన్నత చదువుల కొరకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరూ 26 సంవత్సరాలు తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సమావేశానికి ముందు వారికి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు కొంతమంది ఉపాధ్యాయులు స్వర్గస్తులవడంతో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.

రాజకీయ నాయకులుగా ఉన్నత ఉద్యోగస్తుడిగా వ్యాపారవేత్తలుగా టెక్నీషియల్ గా రైతులుగా అనేక రకాల వృత్తులలో స్థిరపడినవారు స్నేహితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదువుకున్న పాఠశాలకు చదువు నేర్పిన గురువులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు .

 

ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు లక్ష్మాజీ యాదగిరి వెంకట్ రెడ్డి నాగరాజు రవి భాష విద్యార్థుల అభివృద్ధి గురించి తెలుసుకొని ఆనందపడ్డారు ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి దావుల వీరప్రసాద్ స్థానిక సర్పంచ్ రామలింగయ్య బ్రహ్మచారి లింగయ్య వీరయ్య శ్రీనివాస్ మధు వెంకటేశ్వర్లు మధులత ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం గ్రూప్ ఫోటో తీసుకొని స్నేహితులందరూ మళ్ళీ సంవత్సరం కలవాలని వీడ్కోలు తీసుకున్నారు

మరిన్ని వార్తలు