మిర్యాలగూడ : 23న అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

మిర్యాలగూడ : 23న అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

మిర్యాలగూడ, మన సాక్షి
మిర్యాలగూడ మండలంలోని సుబ్బారెడ్డి గూడెం లో ఈనెల 23న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చే నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించునున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మంద శివ తెలిపారు.

 

శుక్రవారం గ్రామం లో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం, సమ సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ లు ఎంతగానో కృషి చేశారన్నారు. భావితరాలకు మార్గదర్శకంగా నిలిచిన వారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవడం కోసం విగ్రహాల ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

3. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

4. Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)

 

ఈ ఆవిష్కరణ మహోత్సవానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాశీం, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి లు అతిధులుగా పాల్గొంటారని, ఈ ఆవిష్కరణ ఉత్సవాలలో నియోజకవర్గంలోని మాదిగ ప్రజాప్రతినిధులకు సన్మానం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి మచ్చ సుమన్, ఉపాధ్యక్షుడుకందుల కిరణ్, ఆది మల్ల నాగేష్, కూరాకుల పాపయ్య, జెట్టి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.