వేములపల్లి : అంబేద్కర్ ఆదర్శప్రాయుడు, ప్రపంచ జ్ఞానమూర్తి – ఎమ్మెల్యే భాస్కర్ రావు

వేములపల్లి : అంబేద్కర్ ఆదర్శప్రాయుడు, ప్రపంచ జ్ఞానమూర్తి – ఎమ్మెల్యే భాస్కర్ రావు

వేములపల్లి , మన సాక్షి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఆదివారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాఆవిష్కరణ అంబేద్కర్ నగర్ లో స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు విగ్రహా ఆవిష్కరణ చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ఆశయాల కనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర పాలన కేసీఆర్ సారధ్యంలో జరుగుతుందని అన్నారు. ఈరోజు భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరణ జరుపుకుంటున్నామని అలాగే శెట్టిపాలెం గ్రామం అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోష దాయకమని ఎమ్మెల్యే అన్నారు.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

 

దళితుల కొరకు దళిత బంధు స్కీం కింద 50 యూనిట్లు రెండో విడతలో ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ,దళితులను ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గృహలక్ష్మి క్రింద సొంత జాగ ఉన్న వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మజ్జిగపు పద్మసుధాకర్, జడ్పిటిసి ఇరుగు మంగమ్మ , ఎంపీటీసీ పళ్ళ వీరయ్య , టిఆర్ఎస్ మండల నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు రెమడాల పరశురాములు , కెవిపిఎస్ రాష్ట్ర సభ్యురాలు కోడి రెక్క రాధిక , అంబేద్కర్ విగ్రహదాతలు ఎలిజాల రమేష్ , డాక్టర్ ఈసం జానకి రాములు,

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

కందుల శివకృష్ణ, భోగారి శ్రీరాములు,కోడి రెక్క ఫకీరయ్య, కోడి రెక్క మట్టయ్య , బొలెదు వెంకన్న, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ బాధ్యులు కోడి రెక్క శంభు లింగం , కోడి రెక్క వెంకటయ్య, మహిళలు ,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!