సుంకరి ఆనంద్ కు డా. ఎ పి జె అబ్దుల్ కలాం అవార్డు

సుంకరి ఆనంద్ కు డా. ఎ పి జె అబ్దుల్ కలాం అవార్డు

అర్వపల్లి, మన సాక్షి , అక్టోబర్ 18:
సామాజిక వేత్త తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కో.ఆ.సొసైటీ ఆర్థిక కార్యదర్శి సుంకరి ఆనంద్ కు భారత్ రత్న డా . ఎ పి జె అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు-2022 లభించింది. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన సుంకరి ఆనంద్ సృజన ఆర్ట్స్ మరియు నేత్రిక ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థలు 1996 నుండి సమాజ శ్రేయస్సు ద్యేయంగా విశేష కృషి చేస్తున్న కవులు, కళాకారులు, విద్యావేత్తలు మరియు సామాజిక వేత్తలకు ప్రతి ఏటా అవార్డులు ప్రదానం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే హైదరాబాద్ నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి మాజీ మంత్రి వర్యులు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. ఎస్ వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా ,సరస్వతి ఉపాసకులు ధైవజ్ఞ శర్మ ,మేడ్చెల్ జిల్లా ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ వధూ వరుల వేదిక కన్వీనర్ సుంకరి ఆనంద్ కో. ఆ. సొసైటీ నిర్మాణం తద్వారా లబ్ధిదారులకు అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం,

పెళ్ళీడు కొచ్చిన పిల్లల తల్లిదండ్రులకు చేయూతనిస్తూ గత 13 సం. ల నుండి నిరంతరాయంగా 22 వేదికలు నిర్వహించి ఉచితంగా వేలాది పెళ్లిల్లు జరగడానికి కారకులు. ఇంతే కాక రోడ్లపై తిరిగే మానసిక వికలాంగులను గుర్తించి వారిని ఓ గూడుకు చేర్చి మరో జన్మణిస్తున్న ఆనంద్ కృషిని గుర్తించి సామాజిక సేవా విభాగంలో అవార్డు కు ఎంపిక చేసి పెద్దల చేతుల మీదుగా అందచేసి అభినందనలు తెలిపారు.