సూర్యాపేట : అంగన్వాడీలో పిల్లలతో రైమ్స్ చెప్పిన జిల్లా కలెక్టర్ 

సూర్యాపేట : అంగన్వాడీలో పిల్లలతో రైమ్స్ చెప్పిన జిల్లా కలెక్టర్ 

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు కల అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి పౌష్టికాహారం కేంద్రంలో వారు పెడుతున్న ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు.

 

పిల్లల మానసిక అంశాలను గమనిస్తూ ఉండాలని కలెక్టర్ అన్నారు. కేంద్రంలో ఉన్న పిల్లలను అక్షరాలు, రైమ్స్ వారితో చెప్పించారు. కేంద్రంలో ఉన్న ఇద్దరు చిన్నారులను వారి శరీరం బరువును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. చిన్నారుల బరువు తగ్గుదల గల కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషక ఆహారాన్ని అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

 

అంగన్వాడీ కేంద్రంలో ఉంటున్న పిల్లల బరువు, ఎదుగుదల తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రిజిస్టర్లను హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు.

 

అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటుగా అర్బన్ సిడిపిఓ కిరణ్మయి, ఆయా జయమ్మ సిబ్బంది పాల్గొన్నారు.