Nalgonda : సిడిపిఓకు అంగన్వాడీలు సమ్మె నోటీస్..!

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో అంగన్వాడి ఉద్యోగ కార్మికులందరూ పాల్గొంటామని గురువారం నల్లగొండ సిడిపిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ యం. డి బాసీద్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు

Nalgonda : సిడిపిఓకు అంగన్వాడీలు సమ్మె నోటీస్..!

నల్లగొండ, మనసాక్షి :

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో అంగన్వాడి ఉద్యోగ కార్మికులందరూ పాల్గొంటామని గురువారం నల్లగొండ సిడిపిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ యం. డి బాసీద్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు.

ALSO READ : Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ* మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకి అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అంగన్వాడి, ఆశ, ఎన్ఆర్హెచ్ఎం, వివోఏ, ఎన్ఆర్ఈజీఎస్ తదితర స్కీములకు నిధులు తగ్గిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు.

ALSO READ : Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

అంగన్వాడి వ్యవస్థను సంస్థాగతంగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్లగొండ ప్రాజెక్టు నాయకులు పాతూరి లక్ష్మి ప్రకృతాంబ, సరోజిని,శ్రీ లక్ష్మీ, స్వప్న, సునీత, మంగమ్మ,పూలమ్మ, జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.