స్వాములకు అన్నదానం చేసిన పాత్రికేయులు శ్రవణ్ కుమార్

స్వాములకు అన్నదానం చేసిన పాత్రికేయులు శ్రవణ్ కుమార్

చౌటుప్పల్. మన సాక్షి :

చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో శివదీక్ష చేపట్టిన శివ స్వాములకు స్థానిక పాత్రికేయులు కొండమడుగు శ్రవణ్ కుమార్ వీణ దంపతుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదానం చేయడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.

శివ స్వాములకు అన్నదానం చేయడం తమ కుటుంబానికి చాలా సంతృప్తిని కలిగించిందని అన్నారు. శివానుగ్రహం వల్ల సకలజనులు సర్వసంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ నూతన సంవత్సరం మొత్తం అందరికీ శుభం కలగాలని కోరారు. అన్నదానం చేసిన దంపతులిద్దరూ శివ స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు. అన్నదానం చేసిన దంపతులను శివ స్వాములు శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శివ గురు స్వాములు ఆదిమూలం శంకర స్వామి, జూలుశంకరయ్య స్వామి, కుక్కల నరసింహ స్వామి, కోహెడ కృష్ణస్వామి, వెంకటరమణ, భీముగోని శ్రీరాములు, తోటి రమేష్, తీగుళ్ల వెంకటేశం, ఉప్పు కృష్ణ, ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ నరసింహ స్వామి ,రమేష్ స్వామి, శివ స్వాములు, స్థానిక పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.