Breaking NewsTOP STORIESviralజిల్లా వార్తలుతెలంగాణసినిమాహైదరాబాద్

Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!

Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఇటీవల కాలంలో యాంకర్ అనసూయ నెటిజెన్సును ఆకట్టుకుంటుంది. ఆమె ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీవీ యాంకరింగ్ నుంచి తప్పకున్న అనసూయ సినీనటిగా బిజీగా మారిపోయింది. అనవసరపు వివాదాల్లో కూడా దూరి చెడ్డపేరు సైతం తెచ్చుకుంటుంది. దేవరకొండ విజయ్ ఫ్యాన్స్ తో ఆమె ఒక యుద్ధమే చేసింది.

 

ఇప్పుడు తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. బోరున విలపిస్తూ ఉన్న వీడియోలు ఆమె షేర్ చేసింది. దాంతోపాటే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. అనసూయ ఎప్పుడు చలాకీగా ఉంటూ సందడి చేసే ఆమె… బోరున విలపిస్తున్న వీడియో పెట్టడం ఏంటి అంటూ నేటిజన్ లు తెగ చూస్తున్నారు.

 

ALSO READ : 

  1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  3. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
  4. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

 

అనసూయ ఎందుకు ఇలా ఏడుస్తుంది. ఆమె జీవితంలో వచ్చిన కష్టాలు ఏంటా అని అందరూ ఆలోచన చేస్తున్నారు. అనసూయ తన పోస్టులో ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళ కైనా, మామూల మనుషులకైనా బాధలు సహజం… జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోక తప్పదు. అయితే మన బాధను వ్యక్తం చేసేలా గట్టిగా ఏడవడంలో ఏమాత్రం తప్పులేదు.

 

బాగా ఏడ్చి ఆ తర్వాత మనసులోని బాధని అంతా బయటకు పంపి తిరిగి సాధారణ పరిస్థితికి రావాలి. బాధని వదిలేసేందుకు ఏడవడంలో ఎలాంటి తప్పు లేదని అనసూయ చెబుతోంది. జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఉన్నాయని ఏమాత్రం అధైర్య పడవద్దు అని కూడా చెప్పింది. నా పోస్ట్ చూసినవారు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా రిలేషన్ పెంచుకోవాలని పేర్కొన్నది. ఒకరికొకరు అండగా నిలవాలని. సమాచార విషయాలని పంచుకోవాలని, జీవనశైలి సంస్కృతులను తప్పక అనుభవించాలని.

 

నా పోస్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని ఫోటోషూట్లు, ఫోజులు, క్యాండిడేట్స్, చిరునవ్వులు ,డాన్సులు, బలమైన కౌంటర్లు, పునరాగమనాలు ఇవన్నీ కూడా నా జీవితంలో ఒక భాగం. అందుకే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పింది. నా జీవితంలో కొన్ని చాలా వీక్ గా ఉన్నాను. ఆ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను . కానీ కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమయంలో బాగా ఏడ్చి సాధారణ స్థితికి రావాలి.

 

ALSO READ : 

  1. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  2. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  3. Land : భూమిని చూపిస్తారా, మమ్మల్నే చూసుకోమంటారా..?

 

కష్టాల నుండి ఎప్పుడు తప్పించుకోవద్దు అంటూ మనసులోని మాటలను షేర్ చేసింది. అందరిని ప్రేమగా ఉండండి అని చెబుతూ… ఇతరుల పట్ల ద్వేషం వద్దని, చెప్పడంతో పాటు ఇతరుల పట్ల ప్రేమను చూపండి అని పేర్కొన్నది. అనసూయ ఎందుకు ఏడ్చింది..? జీవితం గురించి చెప్పడానికి ఇంతలా ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు.

 

 

మరిన్ని వార్తలు