ఫీజు రీఇంబర్స్‌మెంట్ విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి వినతి..!
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త వినతిపత్రం సమర్పించారు.

ఫీజు రీఇంబర్స్‌మెంట్ విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి వినతి..!
ఖమ్మం, మన సాక్షి :
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త వినతిపత్రం సమర్పించారు.
ఆదివారం ఖమ్మం పర్యటనకు విచ్చేసిన ఆయనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ దత్త మాట్లాడుతూ… రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఇంబర్స్‌మెంట్ రాక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు 10 వేల కోట్ల రూపాయల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎదుర్కొంటున్న దయనీయ స్థితిగతులను రాష్ట్ర అధ్యక్షునికి వివరించారు. ఈ నిధుల విడుదలను డిమాండ్ చేస్తూ ఖమ్మంలో తాను నిరాహార దీక్ష చేశానని ఈ సందర్భంగా రామచంద్రరావుకి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి విద్యార్థుల కోసం నిరహార దీక్ష చేసిన రాకేష్ దత్త ను అభినందించారు. భవిష్యత్తు లో తన పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటాదనీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవా భారతి జిల్లా అధ్యక్షులు మోత్కూరి నారాయణరావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, మరియు నాయకులు రుద్ర ప్రదీప్ తదితరులు పాల్గొని విద్యార్థుల డిమాండ్లకు సంఘీభావం తెలిపారు.