వారిది అపూర్వ కలయిక
వారిది అపూర్వ కలయిక
చింతపల్లి. మే 1 మన సాక్షి.
ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి చదువులమ్మ చెట్ల నీడలో… అనే ఆటపాటలతో బాల్యంలో ఓకే పాఠశాలలో చదివి నేడు అందరూ ఒకే వేదికపై ఆత్మీయ సమ్మేళనంతో చిన్ననాటి విద్యార్థులంతా ఒకటయ్యా రు.
చింతపల్లి మండలం మాల్ వెంకటేష్ నగర్ లో ని గొడకొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 2002 ఎస్ఎస్సి బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం జయ గార్డెన్లో ఒకటయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై ఆనాటి జ్ఞాపకాలను స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయులు మాట్లాడారు. విద్యార్థి దశ చాలా విలువైందని నేటి కలయికకు హాజరైన ఎంతోమంది విద్యార్థులు వివిధ రంగాలను ఎంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరిని పలకరించుకుని తమ ఆప్యాయతలను స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు 2002 బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ బృందానికి పూర్వ విద్యార్థుల కు జ్ఞాపిక మెమొంటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జమదగ్ని, బుచ్చయ్య, సోమేశ్వర్, ఎండి అన్వర్, వేణుగోపాల్, మన్సూర్ ఖాన్, రజాక్ విద్యార్థులు వైద్యుల ప్రవీణ్ కుమార్ శర్మ, మహమ్మద్ హజార్, అల్వాల జైపాల్, కడారి పాండు, స్వరూప, కల్పన, నవనీత, మంజుల వీరితో పాటు మరి కొంతమంది విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









