TSRTC : ఆర్టీసీకి మోసం కేసులో గో రూరల్ ఇండియా నిర్వాహకుడు అరెస్ట్..!

తెలంగాణ ఆర్టీసీతో ఉన్న ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల గోరూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు సునీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. దానిని టి ఎస్ ఆర్ టి సి యాజమాన్యం స్వాగతిస్తుందని ఆర్టిసి ఎండి సర్జరీ ట్విట్టర్ లో వెల్లడించారు.

TSRTC : ఆర్టీసీకి మోసం కేసులో గో రూరల్ ఇండియా నిర్వాహకుడు అరెస్ట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆర్టీసీతో ఉన్న ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల గోరూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు సునీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. దానిని టి ఎస్ ఆర్ టి సి యాజమాన్యం స్వాగతిస్తుందని ఆర్టిసి ఎండి సర్జరీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఒప్పందాలను ఉల్లంఘించి బకాయిలను ఎగవేసే సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ హెచ్చరించింది.

తమ బస్సులలో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన 21.73 కోట్ల రూపాయలను మోసం చేసిన కేసులో గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులలో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్ లో టీఎస్ ఆర్టీసీ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ALSO READ : Telangana : తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నిబంధనలు ఇవేనా..!

6 సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుంది. ఒప్పందం మేరకు లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్ లో 10.75 కోట్ల రూపాయలు , సికింద్రాబాద్ రీజియన్ లో 10.98 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి.

కాగా టీఎస్ఆర్టీసీ ఎండిగా సర్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిల సమీక్ష నిర్వహించి లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా గో రూరల్ ఇండియా అనే ఆడ్ ఏజెన్సీకి అనేక పర్యాయాలు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ 55 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చింది. కానీ అవి చెల్లలేదు. ఆ మోసంపై అఫ్జల్ గంజ్ , మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారు.

ALSO READ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలి..!

ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన అధికారులు గో రూరల్ ఇండియా నిర్వాహకుడు సునీల్ ను అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులు ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని సజ్జనార్ స్పష్టం చేశారు.