పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలి..!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని, ఓయూలోగద్దర్ పేరుతో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటుకు ఆలోచించాలని అదేవిధంగా గత ప్రభుత్వ హాయంలో పెంచిన పిహెచ్డి ఫీజులు తగ్గించాలని కోరుతూ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పర్యాటక మరియు సంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు..

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలి..!

ఓయూలో గద్దర్ పేరుతో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పెంచిన పిహెచ్డి ఫీజులు తగ్గించాలి.
మంత్రి జూపల్లి కృష్ణారావు కు ఓయూ విద్యార్థి సంఘాల వినతి

ఉస్మానియా యూనివర్సిటీ , మన సాక్షి :

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని, ఓయూలోగద్దర్ పేరుతో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటుకు ఆలోచించాలని అదేవిధంగా గత ప్రభుత్వ హాయంలో పెంచిన పిహెచ్డి ఫీజులు తగ్గించాలని కోరుతూ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పర్యాటక మరియు సంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు..

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నెల్లి సత్య, డాక్టర్ మండ్ల రవి, లెనిన్ మాట్లాడుతూ* ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గద్దర్ విగ్రహావిష్కరణ ప్రభుత్వమే 1076 గజాల స్థలానికి కేటాయించడం, నంది అవార్డుల స్థానంలో గద్దరు అవార్డులను సాహిత్యకారులకు కళాకారులకు గద్దర్ ప్రతి జయంతి సందర్భంగా అవార్డులను అందజేస్తామని ప్రకటించడం హర్షించదగిన విషయం అన్నారు.

ALSO READ : Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!

అదేవిధంగా గద్దర్ పేరు ఒక జిల్లాకి నామకరణం మరియు ట్యాంక్ బండ్ వద్ద గద్దర్ విగ్రహ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఓయూ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నాం అని వారు అన్నారు. సాహిత్యానికి ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి గద్దర్ తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గద్దర్ రాసిన, పాడిన పాటలపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ALSO READ : BREAKING : టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజీనామా..!

దానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో గద్దర్ పేరుతో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. పిహెచ్డి ఫీజుల విషయంలో కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పీహెచ్డీ ఫీజులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఇమ్మిడి శ్రీకాంత్, అశ్వన్, మహేష్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు