సూర్యాపేట : అర్వపల్లి మండలం అతలాకుతలం
సూర్యాపేట : అర్వపల్లి మండలం అతలాకుతలం
అర్వపల్లి :
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వాన గాలి దుమారంతో రైతులకు భారీ నష్టం సంబంధించింది.
కోతకు వచ్చిన వరి చేను పూర్తిగా నేలమట్టం అయింది . ఐకెపి కేంద్రాలలో పోసిన ధాన్యం కొన్ని గ్రామాలలో తడిసి ముద్దగా అయ్యిందికొన్నిచోట్ల వర్షపు నీరుతో కొట్టుకుపోయింది రామన్నగూడెం కుంచమర్తి తిమ్మాపురం ఐకెపి కేంద్రాలలో దాన్యం కొట్టుకుపోయింది.
జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి కుంచమర్తి గ్రామాలలో ఇండ్లు కూలిపోయినాయి రేకులు గాలికి ఎగిరి ఇంట్లోనే వస్తువులన్నీ తడిసిపోయిన. మామిడి తోటలు నిమ్మ తోటలు బొప్పాయి తోటలతోపాటు కూరగాయల తోటలు కూడా ధ్వంసం అయ్యాయి.
ALSO READ : మిర్యాలగూడ : ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించవద్దు
అడివేముల లో చెట్టు కూలి 70 వేల రూపాయల విలువైన గేద మరణించిందని రైతు తెలిపారు. మండలంలో వడగండ్ల వాన బీభత్సం చేయడంతో సిపిఎం బి ఎస్పి కాంగ్రెస్ సిపిఐ ఎంఎల్ నాయకులు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా చేశారు సమాచారం తెలుసుకున్న స్థానిక తహసిల్దార్ ధర్నాని విరమింప చేశారు.
స్థానిక ఎంపీపీ మన్నె రేణుక పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మార్వో తో కలిసి నష్టపోయిన భూములను ఇండ్లను పరిశీలించారు. మండలంలో దాదాపు 500 ఎకరాలలో పంట పూర్తిగా ధ్వంసం అయినట్లు అంచనా వేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతుల కోరుతున్నారు.











