Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. భర్త ఆత్మహత్య..!

Hyderabad : హైదరాబాదులో దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. భర్త ఆత్మహత్య..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని బేగంబజార్ లో భార్య, కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. భార్య గొంతు కోసి, కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు సిరాజ్. అనంతరం అతను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే ఈ సంఘటన చూసిన అతడి పెద్ద కుమారుడు భయంతో పారిపోయాడు. కుటుంబ కలహాలే అందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సిరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు