Nalgonda : మంత్రాల నేపంతో మహిళపై దాడి.. కేసు నమోదు..!
Nalgonda : మంత్రాల నేపంతో మహిళపై దాడి.. కేసు నమోదు..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అక్కనపల్లి గ్రామంలో మంత్రాల నేపంతో ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటనపై నార్కట్ పల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి చర్యలు చేపట్టడం జరిగిందని ఎస్పీ శరత్చంద్ర పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్కేనపల్లి గ్రామస్తురాలైన ఏనుగుతల ఝాన్సీ ఆరోగ్య సమస్యలను మంత్రాల ప్రభావమని తప్పుడు నమ్మకాలతో ఆమె భర్త ఏనుగుతల దయాకర్, అతని కుటుంబ సభ్యులు కలిసి బెక్కంటి పుల్లమ్మపై దాడిచేసి చంపటానికి ప్రయత్నించారని చెప్పారు.
అక్కనపల్లి గ్రామంలో ఏనుగుతల దయాకర్ భార్య ఏనుగుతల ఝాన్సీ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుచుండగా దానికి కారణం అక్కనపల్లి గ్రామస్తురాలైన బెక్కంటి పుల్లమ్మ భర్త యాదయ్య కులం కుమ్మరి అను ఆమె మంత్రాలు చేయడం వల్లనే ఝాన్సీ అనారోగ్యానికి గురి అయిందని ఆమెను చంపితేనే వారి కుటుంబం అనారోగ్యానికి గురికాకుండా ఉంటుందని భావించి ఏనుగుతల దయాకర్ అతని తండ్రి ఏనుగుతల నరసింహ తల్లి జయమ్మ మామ మిడిదొడ్డి సత్తయ్య లు కలిసి బెక్కంటి పుల్లమ్మ ని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో..
పథకం ప్రకారం మొదటగా ఈనెల ఏడవ తేదీన రోజు బెక్కంటి పుల్లమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడి నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించి, తదుపరి వారి పథకంలో భాగంగా ఏనుగుతల దయాకర్ ఈనెల తొమ్మిదవ తేదీ రోజు సాయంత్రం 6:30 గంటలకు బెక్కంటి పుల్లమ్మకూలి పనికి పోయి తన ఇంటికి వచ్చే క్రమంలో అక్కనపల్లి గ్రామ సెంటర్లో దయాకర్పథకం ప్రకారం వేచి చూస్తూ ఆమె అక్కడికి రాగానే ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి కత్తితోగదమ, వీపుల, చేతులపై పొడిచి చంపటానికి ప్రయత్నించగా అంతలో పుల్లమ్మ భర్త యాదయ్య అక్కడికి రాగా అతనిని చూసి దయాకర్ పారిపోయినాడని తెలిపారు.
ఇట్టి విషయంలో తేదీ 10 న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి తేదీ 11న ఉదయం సదరు నలుగురు నేరస్తులను ఏనుగు తల దయాకర్,ఏనుగు తల నరసింహ ఏనుగు తల జయమ్మ మరియు మిడిదొడ్డి సత్తయ్యలను పట్టుబడి చేసిరిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్లు ఎస్పితెలిపారు.
మంత్రాలను,బాణామతిని ప్రజలు నమ్మవద్దు. ప్రజలకు ఎవరికైనా ఎవరిపైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని యస్పీ చరత్ చంద్ర పవార్ కోరారు . మూఢ నమ్మకాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడతున్నామని, ప్రజలు ఎవరు కూడా మూఢ నమ్మకాలైన మంత్రాలను నమ్మవద్దని దీనికి అపనమ్మకమే బలమైన కారణం అని ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు, వాతావరణ మార్పు, జన్యు సంబందమైన కారణాలు ఉంటాయని వాటి పరిష్కారానికి అత్యాదునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని వాటిని నమ్మకుండా ప్రజలు మూఢoగా మంత్రాలను నమ్మడం పాత కక్షలు మనసులో పెట్టుకుని మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కొట్టి గాయపరచడం, చంపేయడం చేస్తున్నారని ఇకనైనా ప్రజలు మారాలని ఎవరికైనా ఎవరిపైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు.
అలాగే మూఢ నమ్మకాలు అనే మాట లోనే అర్థం తెలుస్తూ ఉంది ఎటువంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా అవి పాటించే వారిని ఇతరులనూ కూడా ఇబ్బంది కి గురి చేసే పద్దతులను మూఢ నమ్మకాలు అంటారని చేతబడి, బాణామతి వంటి నమ్మకాలు తమకు వచ్చిన కష్టానికి అసలు కారణం క్షుణ్ణంగా ఆలోచన చేసి, అది పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే ,ఆ కష్టం తీరుతుందని ఆలా కాకుండా తమపై ఎవరో కక్ష కట్టి మంత్రాలు చేస్తున్నారని నమ్మి, అందుకు విరుగుడు గా ఎవరో ఒకరిపై అనుమానం పెంచుకుని దాడి చేయటం వారిని కొట్టి చంపివేయడం ఈ నమ్మకాల వల్ల కష్టాలు తీరకపోగా సమస్యలు ఎక్కువ అవుతాయని మనకు మన పక్కవారికి కష్టం కలిగించనంత వరకు ఏ నమ్మకమైన పరవా లేదని శృతి మించితే సమస్యలు మొదలవుతాయని కాబట్టి ప్రజలు ఎవరు కూడా వీటిని నమ్మవద్దని ఈ సంఘటనకు బాద్యులైన వారిని పై కఠినమైన చట్టాలను అమలు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అలాగే ఇలాంటి దూరాచారాలను పారద్రోలడానికి కళా జాత బృందాలు గ్రామాల కుల పెద్దలు కులసంఘాలు, గ్రామ పెద్ద మనుసులు కూడా పోలీస్ వారితో సమన్వయంగా అవహగహన కార్యక్రమాలు చేపట్టి ఈ మూఢ నమ్మకాలను కూకటి వేళ్ళతో పారద్రోలీనప్పుడే ఈ అపనమ్మకాలు పూర్తిగా రూపు మాపవచ్చని అన్నారు అలాగే ఎవరైనా ఇక ముందు ఇలా చేస్తే వారి పైన కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.









