TG News : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామనే హామీ ఏమైంది..!
TG News : ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామనే హామీ ఏమైంది..!
ఖమ్మం బ్యూరో, మన సాక్షి:
రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామనే హామీని నిలబెట్టుకోవాలని జిల్లా ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
శనివారం ఖమ్మంలో సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా ఉపేందర్ , ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పేరబోయిన మోహన్ రావు , టియుసిఐ శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ , మరియు ఆటో యూనియన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు గడుస్తున్న ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్ల కు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బంద్ ను విరమించుకోవాలని కోరారు.
పలుమార్లు రాష్ట్ర నాయకులు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన చర్చలకు పిలవకుండా కాలయాపన చేసిందని తెలిపారు . లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఇప్పటికైనా రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి ఎన్నికల హామీని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల రూపాయలు అమలు ప్రకటన చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర మల్లికార్జునరావు, బొట్ల విద్యాసాగర్, అలాగే డ్రైవర్లు వెంకన్న, శ్రీను, నాగేశ్వరావు, భద్రం ,రమేష్ , భాష, నరేష్ ,ఉపేందర్,యాసీన్, నరసయ్య ,రామదాస్ తదితరులు పాల్గొన్నారు.
■ MOST READ :
-
UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : ఆర్ధిక ఇబ్బందులతో రైతు మృతి..!
-
District collector : గ్రామపంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









