Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

అయ్యప్ప స్వామి దేవాలయం లో ఘనంగా పడి పూజ

అయ్యప్ప స్వామి దేవాలయం లో ఘనంగా పడి పూజ

సూర్యాపేట , మనసాక్షి :

అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పడిపూజ కార్యక్రమం చేశారు. ప్రతినెల ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ దేవస్థానంలో ఆనవాయితీగా కొనసాగుతుంది అయితే మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామికి అష్టాదశ , నవ కలశాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు .

 

అభిషేకం నకు ముందు మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు. పద్దెనిమిది దేవతలతో ఉన్న పదేనిమిది మెట్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పడి వెలిగించారు.ఆలయ పూజారులు రెంటాల సతీష్ శర్మ ,కోటి శర్మ ల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ,పయుడిమర్రి కేశవులు ,కోశాధికారి ,ఎర్రంశెట్టి ఉపేందర్ ,ఆలయ కమిటీ సభ్యులు ,వెంపటి పురుషోత్తం ,శంకర్ లాల్ అంతటి విజయ్ ,,రంగయ్య ,భూపతి శ్రీనివాస్ ,రామూర్తి , సీనియర్ గురుస్వాములు మారం సాయి వెంకటేశ్వరరావు , రాచకొండ దేవయ్య , వంకాయలపాటి శంకర్ , రాచకొండ కృష్ణ ,నరేందర్ నాయుడు , వెంకన్న ,విరబ్రహ్మ చారి ,సంపత్ ,సతీష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు