మిర్యాలగూడ : త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్

మిర్యాలగూడ : త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్

మిర్యాలగూడ, మనసాక్షి:

సమాజ హితం కోసం మహమ్మద్ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ.. దానం, సాయం, త్యాగం వంటి సుగుణాలను ప్రతిబింబింపజేస్తుందని.. ఈ పండుగ సమస్త మానవాళికి ఆదర్శనీయం అని.. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సందేశం ఇచ్చారు.

 

గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మిర్యాలగూడ మస్జిద్ కమిటి అధ్యక్షులు పాషా స్వగృహమునకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ముస్లీంలు జరుపు కుంటారని, సమస్త మానవాళి కోసం దైవ ప్రవక్త చేసిన త్యాగాలను వారు స్మరించుకున్నారు..

 

ముఖ్యమంత్రి కేసీ ఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. సంక్షేమ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అల్లా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని వారు ఆకా౦క్షించారు. ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు సందేశానిచ్చారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

 

ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండేలా ఆ అల్లాహ్ కృప యావత్ ప్రాణికీ అందాలని.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. అవంతిపురం 7.20 ఎకరాల స్థలం కేటాయించి ఈద్గా నిర్మించినందుకు ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కి ధన్యవాదాలు తెలియజేసారు.

 

అనంతరం పాషా భాయి ఫౌండేషన్ తరపున విద్యార్ధులకు జ్యుట్ బ్యాగులను రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా అందించారు.

 

ఈ కార్యక్రమంలో నల్లగొండ రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మోశిన్ అలీ, ఖాదర్, మాజీద్, సలీం, ఇలియాస్, వలివుల్ల, రయాజ్,మస్జిద్ కమిటి బాబా బాయి,కుర్భాన్ అలీ,సర్వర్,గౌస్ బాయి, భీమ్లా నాయక్ తదితరులు హాజరయ్యారు.