గ్రామీణ భారత్ బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాల పూర్తి మద్దతు..!

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నట్లు PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు.

గ్రామీణ భారత్ బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాల పూర్తి మద్దతు..!

సిద్దిపేట, మన సాక్షి:

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నట్లు PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ అంబెడ్కర్ సర్కిల్ లో పీడీఎస్.యు, ఎస్.ఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ALSO READ : BREAKING : రోడ్డు ప్రమాదం.. లారీ, పెండ్లి బస్సు ఢీ..!

ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు నేతలు శ్రీకాంత్,ప్రశాంత్,జనార్ధన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, అశాస్త్రీయ భావాలను పాఠ్యపుస్తకాల్లోకి ప్రవేశపెడుతున్నారనీ విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు.

మంగళవారం ఢిల్లీలో రైతులపై ప్రభుత్వం జరిపిన దాడిని ఖండించారు.ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో విద్యార్థులు,ప్రజలు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి వి.విద్యానాథ్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్,PDSU పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు ప్రణయ్ , హిమవంత్,జిల్లా నాయకులు వెంకట్,వెంకటేష్,SFI జిల్లా నాయకుడు షారుక్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!