Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Bjp : రైతుల పంటలకు రుణమాఫీ లేదు.. 500 బోనస్ లేదు..!

Bjp : రైతుల పంటలకు రుణమాఫీ లేదు.. 500 బోనస్ లేదు..!

బీజేఎల్పీ నేత – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, మన సాక్షి :

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను నిండాముంచింది,
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..  సర్కార్ కు ముందుచూపులేకే పంటలు ఎండిపోతున్నాయన్నారు.
నష్టపోయిన రైతులకు అందిస్తామని చెప్పిన తక్షణసాయం ఏదీ..?
కనీసం రైతులకు పంటనష్టం కూడా ఇవ్వలేనిస్థితిలో రాష్ట్ర సర్కార్.. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న సొమ్మంతా కాంట్రాక్టర్లకే దోచిపెడుతున్నారు. టోల్ గేట్లలో వసూలు చేసినట్లు ఆర్, బీ ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారని అన్నారు.

ఇప్పటి వరకు రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు.
పంటకు రూ. 500 బోనస్ ఇవ్వలేదు.
రూ. 15000 రైతు భరోసా సాయం ఇవ్వలేదు.
కౌలు రైతులకు రూ. 12000 సాయం ఇవ్వలేదు.
సాగు నీరు లేదు, సబ్సిడీలు లేవు.
ఇప్పుడు పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదు.
వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలి.

ఎస్సారెస్పీ నుంచి నీటిని డిఫాక్టో సీఎం దోచుకెళ్తున్నారు
ఉత్తరాంధ్ర రైతులకు అన్యాయం చేస్తున్నారు.
ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సల్లబడుతున్నారు
మంత్రి శ్రీధర్ బాబు తీరుతో అన్నదాతలకు నష్టం
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కో మంత్రిది ఒక్కో తీరు

ALSO READ : 

మరిన్ని వార్తలు