నర్సాపూర్ లో బిజెపికి భారీ షాక్..!

నర్సాపూర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన 231 మంది ముఖ్య నాయకులతోపాటు కార్యకర్తలు బిజెపి పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు . ఈ రాజీనామా పత్రాలను బిజెపి అధిష్టానానికి పంపనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగయ్యకపల్లి గోపి, నర్సాపూర్ టౌన్ ఇన్చార్జి బాల్ రెడ్డి , శివంపేట అధ్యక్షులు నల్ల రవి గౌడ్ లు తెలిపారు.

నర్సాపూర్ లో బిజెపికి భారీ షాక్..!

బిజెపి నాయకుల ముక్కు మడి రాజీనామా లు..

నర్సాపూర్, (హత్నూర),మన సాక్షి:

నర్సాపూర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన 231 మంది ముఖ్య నాయకులతోపాటు కార్యకర్తలు బిజెపి పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు . ఈ రాజీనామా పత్రాలను బిజెపి అధిష్టానానికి పంపనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగయ్యకపల్లి గోపి, నర్సాపూర్ టౌన్ ఇన్చార్జి బాల్ రెడ్డి , శివంపేట అధ్యక్షులు నల్ల రవి గౌడ్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి అధిష్టానం నాయకులపై కార్యకర్తలపై నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నందున మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 80 స్థానాలను పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సిద్ధాంతాలు తెలియని వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తన ఇష్టానుసారంగా వివరిస్తూ పార్టీకి అనుభవం లేని ఆయనకు నచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇప్పిచ్చారని మండిపడ్డారు రాష్ట్రంలో బిజెపి పార్టీని నామరూపాలు లేకుండా బొంద పెట్టడానికి కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి మురళి యాదవ్ కు టికెట్ ఇచ్చే వ్యవహారంలో స్థానిక నాయకుల ను కార్యకర్తలను సంప్రదించకుండా టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

టికెట్ కేటాయించి 23 రోజులు గడుస్తున్న నర్సాపూర్ నియోజకవర్గంలోని బిజెపి సీనియర్ నాయకులను కార్యకర్తలను కలవకుండా మురళీధర్ యాదవ్ ప్రచారం చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు .

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!

గత మూడు రోజుల క్రితం హైదరాబాదులో కాంగ్రెస్ అభ్యర్థి తో మురళీధర్ యాదవ్ మంతనాలు జరపడం ఆంతర్యం ఏమిటని అన్నారు ఇప్పటికైనా బిజెపి అగ్ర నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కోవార్టులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి సస్పెండ్ చేయాలని పార్టీ బతికించాలని వారు కోరారు.

రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తీరు వల్లే నర్సాపూర్ నియోజకవర్గంలోని బిజెపి ముఖ్య కార్యకర్తల మందిరం రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు శ్రీశైలం, శ్యామ గౌడ్ అశోక్ మానాయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. నలుగురు సర్పంచులు రాజీనామా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..!