Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BLR : బీఎల్ఆర్ జోడో యాత్రకు గ్రామ గ్రామాన స్పందన

బీఎల్ఆర్ జోడో యాత్రకు గ్రామ గ్రామాన స్పందన

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్ చేపట్టిన జూడో యాత్రకు గ్రామ గ్రామా న స్పందన లభిస్తుంది.  గద్ద గుండు తండా నుండి ప్రారంభించి జటావాత్ తండా, దీరావత్ తండా, కొత్త సామ్య తండ, జప్తి వీరప్ప గూడెం, కొత్తూరు గుండా టిక్యా తండా లో కొనసాగింది. పాదయాత్రకు హాజరైన బీ ఎల్ ఆర్ ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే గ్రామాలలో అభివృద్ధి, రైతు రుణమాఫీ, కౌలు రైతులకు నగదు, 500/-లకే గ్యాస్ సిలిండర్, వృద్ధ దంపతులు ఇద్దరికీ పెన్షన్, నిరుద్యోగ భృతి, చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పదవులు పొంది, డబ్బులు వెనక వేసుకున్న నాయకులు మాత్రమే పార్టీ ఫిరాయించారు..!! కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం నిలబడ్డారని,మిర్యాలగూడ లో కాంగ్రెస్ పార్టీకి *ద్రోహం చేసిన నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు.

కార్యకర్తలకు ఎల్లవేళలా అర్ధరాత్రి అయినా సరే అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను అన్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తల ను సమన్వయం చేస్తూ.. మిర్యాలగూడ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసే వరకు విశ్రమించనని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రత్న కుమారి చాలపతి రావు,  జింద, డీసీసీబీ మాజి డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మాజి సర్పంచ్ వెంకటయ్య, పాండు నాయక్, వెంకట్ రామ్, కౌసల్య, నారాయణ రెడ్డి, దేవి సింగ్ నాయక్, పత్య నాయక్, హరిచంద్ నాయక్, సిద్దు నాయక్, నాగు నాయక్, చందు నాయక్, నాగరాజు నాయక్, బాల, కొండ నాయక్,d వెంకట్ రామ్, తులరం సింగ్, హుసేన్, వెంకట్ రాములు,రాజు, లతీఫ్, రాములు నాయిక్,శ్రీను నాయిక, బాలు నాయక్, తదితరుల పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు