BLR : బి ఎల్ ఆర్ కు అండగా ఉండాలి – రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
మిర్యాలగూడ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఎల్ఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు.

BLR : బి ఎల్ ఆర్ కు అండగా ఉండాలి – రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
మిర్యాలగూడ , మనసాక్షి
మిర్యాలగూడ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఎల్ఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మిర్యాలగూడలో భత్తుల లక్ష్మారెడ్డి మరియు బిసి సంఘ నాయకుల, మిర్యాలగూడ బిసి కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ ఏబిజే అబ్దుల్ కలాం, సావిత్రిబాయి పూలే, శ్రీకాంతాచారి విగ్రహాల స్థాపనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ .కృష్ణయ్య చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే ప్రజలందరికీ న్యాయం చేకూరుతుందని తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో తెలంగాణ ప్రజలు ముందుంటారని ఆయన అన్నారు. మిర్యాలగూడలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటుగా మహనీయుల విగ్రహాలన్నీ కూడా బత్తుల లక్ష్మారెడ్డి ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన అన్నారు.
మిర్యాలగూడలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా భూమి పూజను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు బీసీ సంఘం నాయకులకు బిఎల్ఆర్ బ్రదర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది మిత్రులు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రాంతంలో భత్తుల లక్ష్మారెడ్డి ( BLR ) సేవా కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు పేదలకు పెళ్లిళ్లకు శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు, వైకుంఠ రథం, ఈశ్వర బంధం ఆరోగ్య రక్ష వాహనం పేదలకు చాలా సేవ చేస్తున్నారని నాకు చెప్పడం జరిగినది.
ఈ ప్రాంతం ప్రజలు BLR ని అభినందించాలని, చాలామందికి డబ్బు ఉంటది గానీ అర్ధరూపాయి ఖర్చు చేయరన్నారు. BLR కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ BLR వెంట ఉండాలని నా సహాయ సహకారాలు బి ఎల్ ఆర్ కి ఎప్పుడూ ఉంటాయని ఆర్ కృష్ణయ్య చెప్పడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు వివిధ సంఘాల అధ్యక్షులు స్వచ్ఛంద సేవ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ యువజన నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!
- Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
- మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
- అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం
- Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!