BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!

BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!
హైదరాబాద్, మనసాక్షి : ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూశారు హైదరాబాదులో ని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస గడిచారు దాంతో ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ యావత్తు శోకసంద్రంలో మునిగింది మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో దళితు కుటుంబం లచ్చమ్మ – శేషయ్యలకు 1949లో గద్దర్ జన్మించారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన అనేక పాటలు రాసి, వాడి తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు నడిపించారు. ఆయన రాసిన అమ్మా తెలంగాణమా అనే పాట ఉద్యమానికి ఊపిరి పోసింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ పాటకు గద్దర్ కు నంది అవార్డు లభించింది. అయినా కూడా ఆయన అవార్డును తీసుకోలేదు.
ALSO READ :
- Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
- PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
- UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
గద్దర్ భార్య విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారువ కాగా 2003లో ఒక కుమారుడు మరణించాడువ 1975లో బ్యాంక్ క్లర్క్ వచ్చింది. ఆ తర్వాత 1984లో బ్యాంకు ఉద్యోగా వనికి రాజీనామా చేసి బడుగు, బలహీన వర్గాలను ఆటపాటలతో చైతన్యపరిచాడు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జనా నాట్యమండలిలో చేరాడు.
ఒగ్గు కథ, బుర్రకథ ,ఎల్లమ్మ కథలతో ప్రజలను చైతన్య పరిచారు. 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. గద్దర్ మృతికి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు శోకసంద్రంలో మునిగారు. రాజకీయ సీనీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.