Nalgonda : కనగల్ బ్రిడ్జి కింద వ్యక్తి మృతదేహం లభ్యం..!
Nalgonda : కనగల్ బ్రిడ్జి కింద వ్యక్తి మృతదేహం లభ్యం..!
కనగల్, మన సాక్షి:
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని బ్రిడ్జి కింద ఆదివారం వ్యక్తి మృతదేహం లభ్యమయింది. కనగల్ ఎస్సై బి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…. కనగల్ బ్రిడ్జి కింద వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించగా అక్కడ లభించిన బ్యాగులో ఆధార్ కార్డు లభ్యమయింది.
అందులో సముద్రాల కృష్ణ, న్యూ గుండ్లపల్లి యాదగిరిగుట్ట అని ఉంది. మృతుని వయసు అందాజ 50 సంవత్సరాలుగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తి చనిపోయి ఐదు ఆరు రోజులు కావస్తున్నందున మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నల్లగొండకు తరలించారు. ఇక్కడే చంపేశారా లేక మరెక్కడైనా చంపి ఇక్కడ పడేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ :
Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!
డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!









