Paddy : సన్నధాన్యంకు బోనస్.. ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే ఇస్తారా.. మిల్లులో విక్రయించుకున్నా బోనస్ వస్తుందా..!
Paddy : సన్నధాన్యంకు బోనస్.. ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే ఇస్తారా.. మిల్లులో విక్రయించుకున్నా బోనస్ వస్తుందా..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను దండిగా అమలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మినహా మిగతా హామీలు పూర్తిస్థాయిలో ఏవి అమలు కావడం లేదని తెలుస్తోంది.
గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందజేస్తామనేది పూర్తిస్థాయిలో ఇప్పటికి అందలేదు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అనే అంశం కూడా సగం మందికే అందుతుంది. టెక్నికల్ గా తప్పులు దొరలడం వల్ల సగం మందికే ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకాలన్నీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో కనీసం అధికారులు తప్పులు సరి చేసే పరిస్థితిలో కూడా లేకుండా పోయారు. ప్రభుత్వం గ్యారెంటీ హామీలలో మహిళలకు 2,500 నెలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అవి అమలు కావడం లేదు. అదేవిధంగా ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పినా.. ఎన్నికల కోడ్ కారణంగా అవి కూడా అమలుకు నోచుకోవడం లేదు.
సన్నధాన్యంకు రూ.500 బోనస్ :
ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోళ్లకు అందించే బోనస్ విషయంలో కిరికిరి ఉందని చెప్పవచ్చును. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నధాన్యాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు. రాబోయే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా రైతులకు ఇది ఆనందకరమైన విషయమే… ఎక్కువ మంది రైతులు కూడా సన్నధాన్యాన్ని పండిస్తున్నారు. అందుకు వారికి క్వింటాకు అదనంగా ప్రభుత్వం 500 రూపాయలు చెల్లిస్తే మరింత లాభం చేకూరే అవకాశం ఉంది.
ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..?
రైతులు పండించిన సన్నధాన్యమును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..? లేక ప్రైవేటుగా ధాన్యం మిల్లులకు రైతులు నేరుగా విక్రయించుకున్నప్పటికీ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందజేస్తుందా..? మరి ఏ విధంగా అందజేస్తుందనే విషయం స్పష్టంగా రైతులకు తెలియడం లేదు. ప్రస్తుతం ఐకెపి కేంద్రాల ద్వారా ఎక్కువగా దొడ్డు రకం దాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సన్న రకం ధాన్యము రైతులు నేరుగా మిల్లులకు విక్రయించుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా రైతులు నేరుగా మిల్లులకు విక్రయించుకున్నప్పటికీ ప్రభుత్వం బోనస్ అందజేస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. సన్నధాన్యం కూడా ఐకెపి కేంద్రాలలో కొనుగోలు చేస్తారా..? ఒకవేళ కొనుగోలు చేస్తే ఏ ప్రాతిపదికన కొనుగోలు చేస్తారు..? అనేది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
సన్న ధాన్యం పండించిన రైతులందరికీ బోనస్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. రైతులు నేరుగా మిల్లులో విక్రయించినప్పటికీ బోనస్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపై వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకుంటే సన్న ధాన్యం మిల్లులో విక్రయించుకునే రైతులకు బోనస్ అందే అవకాశం లేదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ప్రాతిపదికన బోనస్ ఇచ్చారనే దానిపై అధికారులు మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది.
దొడ్డు రకం పండించే రైతుల పరిస్థితి ఎలా..?
కొన్ని ప్రాంతాలలో రైతులు దొడ్డు రకం దాన్నే మాత్రమే పండిస్తారు. వానాకాలం సీజన్లో ఎక్కువ మంది రైతులు సన్న రకాలను పండిస్తున్నప్పటికీ యసంగి సీజన్ లో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకం దాన్యం మాత్రమే పండిస్తారు. మరి సన్న రకం ధాన్యంకే ప్రైవేటు మార్కెట్లో ఎక్కువ ధర లభించడంతోపాటు డిమాండ్ కూడా ఉంటుంది.
ప్రభుత్వం వాటికే బోనస్ అందిస్తామని చెబుతోంది. దొడ్డు రకం దాన్యమును రైతులు ఎక్కువగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకుంటారు. ప్రైవేటు మార్కెట్లో వాటికి డిమాండ్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి ప్రభుత్వం బోనస్ చెల్లించకుంటే పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు.
MOST READ : క్లిక్ చేసి ఇవి కూడా చదవండి :
Miryalaguda : మిర్యాలగూడలో ఏంటి ఇలా.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మొదలయ్యిందా..?
Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!
డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!
Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!











