Miryalaguda : మిర్యాలగూడలో ఏంటి ఇలా.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మొదలయ్యిందా..?

కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ పట్టణంలో ఏం జరుగుతుంది.  మళ్లీ మొదలయ్యాయా...? అంటే కొన్ని సంఘటనలు చూస్తే ఔనని చెప్పవచ్చును. 

Miryalaguda : మిర్యాలగూడలో ఏంటి ఇలా.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మొదలయ్యిందా..?

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ పట్టణంలో ఏం జరుగుతుంది.  మళ్లీ మొదలయ్యాయా…? అంటే కొన్ని సంఘటనలు చూస్తే ఔనని చెప్పవచ్చును.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీలో ఏండ్ల తరబడిగా గ్రూప్ తగాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ గ్రూప్ తగాదాలు పోవడంలేవు. ఈసారి ఎలాంటి గ్రూపులు ఉండవనుకున్నప్పటికీ అప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో విజయం సాధించిన భత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా అన్ని గ్రూపులను కలుపుకొని పోతారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తన అనుచరులతో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూకల వేణుగోపాల్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు.

గ్రూపులు మొదలయ్యాయా..?

కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ పట్టణంలో గ్రూపులు మొదలయ్యాయి అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించడం దేనికి సంకేతం అని చర్చించుకుంటున్నారు. భార్గవ్ తన అనుచరులతో హైదరాబాదులో చేరికను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల వారు తిరిగి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో మరోసారి చేరారు. దాంతో అందరూ సమ్మతించారు.

కానీ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కలిసిపోయే ఆలోచన ఇరువర్గాలకు కూడా లేనట్టుంది. అందుకోసం రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని వేరువేరుగా నిర్వహించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పార్టీలో గ్రూపులుగా విడిపోయి వేరు వేరు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు.

రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం : 

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్, డి సి సి అధ్యక్షుడు శంకర్ నాయక్ రాకముందే ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ వలసవాదులు అవినీతిపరులు అయినటువంటి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వద్దంటున్న బ్రతిమిలాడుకొని అనిగి మణిగి ఉంటామని పార్టీలో పెత్తనం చేయటానికి ప్రయత్నం చేయమని కల్లబొల్లి కబుర్లు చెప్పి వచ్చిన రాజకీయ నాయకులు రాజీవ్ గాంధీకి పూలదండలు వేసి ఆ విగ్రహాన్ని మైల పరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఇన్చార్జిలు రాజీవ్ గాంధీకి పాలాభిషేకం చేసి ఆ తర్వాత జలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేయడం జరిగింది.

ఇవి కూడా క్లిక్ చేసి చదవండి : 

KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!