BRS : బీఆర్ఎస్ దుకాణం బంద్..!

టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీ ఆర్.. బీఆర్ఎస్ గా పేరు మార్చారు. బీఆర్ఎస్ గా పేరు మార్చిన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. తెలంగాణతో పాటు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పోటీ చేయాలని నిర్ణయించారు.

BRS : బీఆర్ఎస్ దుకాణం బంద్..!

తెలంగాణ వరకే పరిమితం అయ్యిందా..?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న నేతలు

పార్టీ మారే నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నం

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీ ఆర్.. బీఆర్ఎస్ గా పేరు మార్చారు. బీఆర్ఎస్ గా పేరు మార్చిన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. తెలంగాణతో పాటు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పోటీ చేయాలని నిర్ణయించారు. అందుకు గాను దేశంలోని పలు ప్రతిపక్ష , ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కూడా ఆయన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో సభ నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. జాతీయ పార్టీగా పేరు సంపాదించడానికి బీహార్ లో రైతుల ధర్నాకు మద్దతు తెలియజేయడంతో పాటు అక్కడ రైతు పోరాటంలో మృతి చెందిన రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేసి తనదైన శైలిలో చక్రం తిప్పాలని భావించారు.

ఊహించని పరిణామం :

బీఆర్ఎస్ కు తెలంగాణ రాష్ట్రంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు మూడోసారి పెద్ద షాక్ ఇచ్చారు. అధికారం నుంచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. దాంతో రాబోయే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే.

ALSO READ : BREAKING : ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి.. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..!

ఇంకా పార్టీ మారేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నేతలను కట్టడి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు కూడా సమాచారం. మరోపక్క బీ ఆర్ ఎస్ ను బొంద పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బహిరంగంగా ప్రకటించారు. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఏర్పడింది.

దుకాణం బంద్ :

తెలంగాణలోనే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా దుకాణం బంద్ అయిందని చెప్పవచ్చు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని ఆ పార్టీ నేతలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. కేసీఆర్ కూడా తనదైన శైలిలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశాలు సైతం నిర్వహించారు. కానీ లోకసభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కనీసం ఏ ఒక్క రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీతో కూడా చర్చించిన దాఖలాలు కనిపించడం లేదు.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

ప్రాంతీయ పార్టీల సమూహంలో కనిపించకపోవడంతో పాటు జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం పోటీలో నిలబెట్టే పరిస్థితులు కనిపించడం లేవు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. ఇక జాతీయ రాజకీయాల వైపు చూసే పరిస్థితిలో కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేవలం తెలంగాణలోనే అన్ని స్థానాలకు పోటీ చేసి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.