BRS, CONGRESS : బి ఆర్ ఎస్, కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే..!

బి ఆర్ ఎస్,కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని ఆపార్టీ లు అవినీతి,కుటుంబ రాజకీయాలే నిదర్శనం అని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ అన్నారు.

BRS, CONGRESS : బి ఆర్ ఎస్, కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే..!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి.

నారాయణపేట టౌన్, మనసాక్షి :

బి ఆర్ ఎస్,కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని ఆపార్టీ లు అవినీతి,కుటుంబ రాజకీయాలే నిదర్శనం అని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపిపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కుమ్మక్కై దుష్ప్రచారం చేసినా బిజెపి మూడు స్థానాల నుంచి 8మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది అని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ప్రచారం సాగిస్తున్నారని అది బిజెపికే లాభం అవుతుందన్నారు.బి ఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం లేకపోతే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పనిగట్టుకుని బిజెపిపై టిఆర్ఎస్ కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని వా పోయారు.

ALSO READ : మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఆలగడప, దొండవారి గూడెంలో దాడులు..!

ఎందరు ఏకమైన ప్రజల విశ్వాసం నరేంద్రమోడీకి ఉందని మోడీని ఆప్ శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370సీట్లు, ఎన్డీఏ కు 4వందలకు పైగా ఎంపి స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అన్ని రంగాలకు కేంద్రం వేలాది కోట్ల నిధులు వెచ్చిందని అన్నారు. పాలమూరు యునివర్సిటీ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విధ్మరించిన ప్రధాని నరేంద్ర మోడీ విద్యా,సాంకేతిక విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి వంద కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

గతంలో భారత్ అంటే ప్రపంచ దేశాలు చిన్న చూపు చుసేవని నేడు ప్రధాని కృషి వల్ల అగ్ర దేశాల సరసన భారత్ ను నిలబెట్టారన్నారు. అలాగే గత ప్రభుత్వాలు అవినీతి అధర్మ పాలన సాగించాయి గత 10ఏళ్లలో బిజెపి ప్రభుత్వం ఒక్క మచ్చ లేని అవినీతి లేని న్యాయవంతమైన ధర్మ పాలన అందిస్తున్నారని అన్నారు.ప్రజలు రాబోయే ఎన్నికల్లో ధర్మ పాలన కావాలా అధర్మ పాలన కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు.

ALSO READ : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!

ప్రధాని విరామం లేకుండా పేదల సంక్షేమం, మహిళ సాధికారత, అంతర్గత, బాహ్య భద్రత, సాంస్కృతిక పునరుద్దరణ,విదేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఊహకు కూడా అందని అసాధారణ అభివృద్ధి సాధించిందన్నారు. అభివృద్ధి దార్శనికతను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన,కేంద్ర పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం ద్వారా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి యావత్ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొనీ ఈ సారి బిజెపి కి సొంతంగా 370సీట్లు వచ్చేలా పని చేయాలని పిలుపనిచ్చారు.

ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కే. అరుణ, మాజీ ఎంపి. ఎ పి.జితేందర్ రెడ్డి, బి.శాంతి కుమార్ , బంగారు శృతి , రాష్ట్ర నాయకులు నాగురావు నామ జీ, కే.రతన్ పాండు రెడ్డి, కొండయ్య, యాత్ర ఇంఛార్జి శ్రివర్ధన్ రెడ్డిబిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు ,మహిళా మోర్చ్కా జిల్లా అధ్యక్షురా లులక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ కేసీ నర్సింలు పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, నాయకులు సత్య యాదవ్ ,రఘువీర్ యదవ్, సత్య రాఘుపాల్ ,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ALSO READ :