BRS : బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!

BRS : బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..!

అర్వపల్లి , మన సాక్షి

మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసిఆర్ వలస వాదులతో నిండిపోయిన కారు
తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా 2001 నుండి నేటి వరకు కెసిఆర్ కేటీఆర్ అడుగుజాడల్లో నడిచి తుంగతుర్తి నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వకపోవడంతో ఈరోజు పార్టీ రాజీనామా చేస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మందుల సామిల్ అన్నారు.

 

శుక్రవారం అరవపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో మాదిగలకు తీరని అవమానం జరుగుతుందని అన్నారు మాదిగ మంత్రి లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైనా నడిచిందా అని అన్నారు.

మన రాష్ట్రం మన ప్రభుత్వం కావాలని ఉద్యమం చేసిన జాతి మాదిగ జాతి అని అలాంటి జాతిని అవమానపరిచిన కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కిషోర్ కు మాదిగలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

 

ALSO READ :

  1.  Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు
  2. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!
  3. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

 

దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని పది సంవత్సరాలు పాటు మోసం చేసి ఇప్పుడు దళిత బంధు పేరుతో మాదిగలను మరోసారి మోసం చేసినందుకు కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.

 

తిరుమలగిరి మండలంలో దళిత బంధులో జరిగిన అవినీతిపై మంత్రి కేటీఆర్ సభలో ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు అన్నారు . 12వేల పల్లెలో మాదిగలకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన వ్ చెప్పాలని అన్నారు.  గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లు ఇప్పటికీ ఉన్నాయని వాళ్ళు ఇచ్చిన భూములను మీరు ధరణి పేరుతో కబ్జాలు చేస్తున్నట్లు ఆరపించారు.

ప్రజల సొమ్ముతో నిర్మించిన మీ ప్రగతి భవన్లో మాదిగ నాయకుడు ఒక్కరైనా వచ్చినారా అని అన్నారు
తుంగతుర్తి నియోజకవర్గం లో ఎస్సారెస్పీ కాలువల ద్వారా వచ్చే నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కావా అన్నారు కాలేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర కెసిఆర్ ప్రభుత్వం ఉందని అన్నారు
శ్రీరామ్ ప్రాజెక్ట్ కు బి.ఎన్.రెడ్డి చేసిన కృషిని మర్చిపోవద్దు అన్నారు.

దళితులకు పదవి పేరుతో రాజయ్యను కడియం శ్రీహరిని అవమానపరిచి పదవి నుంచి తొలగించారని పదవిలో ఉన్న కొప్పుల ఈశ్వర్ కు లక్ష రూపాయలను మంజూరు చేసే హక్కు లేకుండా చేసినట్లు అనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వారికి అండగా ఉంటామని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురెడ్డి పోరాడిన నాయకులు మరుగున పడిపోయారని వలసవాదులు సమైక్యవాదులు రాజ్యంలో పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు.

 

రాష్ట్ర మొత్తం మాదిగలను ఏకం చేసి మాదిగ ఆత్మగౌరవం ఏ పాడుదో నిరూపిస్తున్నట్లు తెలిపారు
టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదని ఆవేదనతో అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కీ మాదిగలు ఓటు వేయకుండా వారి సత్తా ఏందో చూపించాలని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం లో వలస పాలకుల నుండి కాపాడుకుందామని ఏ పార్టీ నుండి అయినా స్థానిక నాయకులకే టికెట్ ఇచ్చే విధంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మాల మాదిగలకు గొడవలు సృష్టిస్తున్నారని కానీ తుంగతుర్తి నియోజకవర్గం లోని మాల మాదిగలు అన్నదమ్ముల వలె కలిసి ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ తొలి దశ ఉద్యమం మలిదశ ఉద్యమం లో అమరులైన అమరవీరుల కుటుంబాలను కలుపుకొని ఉద్యమకారులమందరం ఒక్కటై పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు.

టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి పార్టీకి సేవ చేసిన నేను బయటకు వెళ్లే పరిస్థితి తెచ్చిన టిఆర్ఎస్ పార్టీకి నేటి నుండి గడ్డు రోజులు వస్తాయని అన్నారు. ఉద్యమకారులందరూ పార్టీలు విడుదలని హెచ్చరించారు.
రాజీనామా పత్రం కెసిఆర్ కు పంపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుండి ముఖ్యమైన నేతలు పాల్గొన్నారు.