BRS : బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర కలవరం.. రంగంలోకి హరీష్ రావు..!

వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతుంది. వరంగల్ నగర కార్పొరేటర్లు ఆరుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది.

BRS : బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర కలవరం.. రంగంలోకి హరీష్ రావు..!

వరంగల్ , మన సాక్షి :

వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతుంది. వరంగల్ నగర కార్పొరేటర్లు ఆరుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ను కార్పొరేటర్లు కలిసినట్లు సమాచారం. కాగా కార్పొరేటర్లు పార్టీ మారకుండా రంగంలోకి మాజీ మంత్రి హరీష్ రావు దిగినట్లు సమాచారం.

కార్పొరేటర్లకు ఫోన్ చేసి పార్టీ మారొద్దని కోరుతున్నట్లు తెలిసింది. హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా కార్పొరేటర్లు వినకుండా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. రాబోయే భవిష్య త్తు మనదే ఉంటుందని, పార్టీ మారొద్దని హరీష్ రావు వాళ్లకు సూచించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ను కలిసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరుణకుమారి, తూర్పాటి సులోచన, రాధిక రెడ్డి, దివ్య రాణి, జక్కుల రజిత , ఈదురు అరుణ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ : Telangana : నాడు తొడగొట్టి.. నేడు కాళ్ళ బేరం..!