Nalgonda : బీఆర్ఎస్ ది ఫామ్ హౌస్ పాలన.. కాంగ్రెస్ ది ప్రజా పాలన..!
Nalgonda : బీఆర్ఎస్ ది ఫామ్ హౌస్ పాలన.. కాంగ్రెస్ ది ప్రజా పాలన..!
నల్లగొండ, మన సాక్షి
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెండింగ్లో పెట్టిన సాగు తాగు నీతి ప్రాజెక్టులన్నింటినీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు విడుదల చేసి పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
డిండి, ఏదుళ్ళ ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది.
బిఆర్ఎస్ హయంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి అయింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించింది.
కిలోమీటర్లు కూడా ప్రాజెక్టును పూర్తి చేయలేదు.
ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్ధ తపాలన టిఆర్ఎస్ ది. బిఆర్ఎస్ అయంలో జగదీశ్ రెడ్డి తన ఫామ్ హౌస్ ను డెవలప్మెంట్ చేసుకున్నాడు తప్ప జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కళ్ళు ఉండి చూడలేని కబోది జగదీశ్ రెడ్డి. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలి. లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదు.
ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,
మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, మామిడి కార్తీక్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
Komatireddy : మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్..!
-
Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!
-
District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!









